పలాస;
పలాస నియోజకవర్గ పరిధిలోని 383 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం అందజేశారు.
పలాస టీడీపీ కార్యాలయం అవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను అంగన్వాడీ వ్యవస్థకు అనుసంధానించడం ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు మొబైల్ సేవలను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
Post Views: 61









