కారేపల్లి మండలంలో ఏసీబీ అధికారులు సంచలన దాడి నిర్వహించారు.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి రూ.10,000 లంచం తీసుకుంటున్న సమయంలో కారేపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో, కారేపల్లిలోని ఆర్‌ఐ నివాసం వద్ద ఆమెను పట్టుకున్నారు.
లంచం తీసుకుంటున్న విషయంపై ముందుగా అందిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.ఈ ఘటన స్థాని1కంగా తీవ్ర చర్చకు దారితీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 312









