E-PAPER

న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థుల ప్రతిభ

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వై 7 న్యూస్ ఆగస్టు 11

శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4వ నేషనల్ కరాటే అండ్ కుంగ్ ఫు టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 రోజి గార్డెన్ ఫంక్షన్ హాల్ బోయపల్లి గేట్ మహబూబ్ నగర్ జరిగిన కరాటే కుంగ్ ఫు పోటీలలో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీకి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం రాహుల్, చేతన్, ప్రేమ్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ కనకం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసిన కుంగ్ ఫు, కరాటే, టైక్వాండో విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం అలానే మహబూబ్ నగర్ లో 4వ నేషనల్ కరాటే, కుంగ్ ఫు, టైక్వాండో నిర్వహించిన వెంకటేష్ మాస్టర్ కి అభినందనలు తెలిపారు. బాల బాలికల వారి తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడల యందు శిక్షణ ఇవ్వడానికి ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ కనకం యాదవ్, బాలరాజ్ మాస్టర్, నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ), శివ కృష్ణ మాస్టర్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News