ఓ ఆదివాసి లారా మేల్కోండి కొర్స దొర
దమ్మపేట ఆగస్టు 4 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో కొమరం భీం, సోయాం గాంగులు విగ్రహలు వద్ద ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆదివాసీల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కొర్స దొర అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కొర్సా వెంకటేష్ దొర మాట్లాడుతూ ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఆదివాసులంతా ఏకమై తాసిల్దార్ కార్యాలయం పక్కన ఉన్న కొమరం భీం సొయం గంగులు విగ్రహాల వద్దకు చేరుకొని ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్క ఆదివాసీల కృషి కావాలని కోరారు, అలాగే ప్రతి గ్రామాన ఆదివాసీ జెండా ఎగరాలని ఆదివాసి దినోత్సవ ప్రాముఖ్యతను చాటాలని ఆదివాసి హక్కులను కాపాడాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్షా వెంకటేశ్ దొర ఆదివాసీలకు పిలుపునిచ్చారు.ప్రతి గ్రామంలో ఉదయం ఏడు గంటలకి పంచాయతీలో ఉదయం 8 గంటలకు మండల కేంద్రంలో 9 గంటలకు నియోజకవర్గంలో 10 గంటలకు ప్రతి ఒక ఆదివాసీ నాయకులు హాజరయ్యి ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న విజయవంతం చేయాలని కొర్సా కోరారు.ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసీల ఐక్యతను దృష్టిలో ఉంచుకొని అందరూ సమన్వయంతో అభివృద్ధి బాటలో నడవాలని తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేశ్ దొర తెలిపారు.
వారితోపాటు ఈ కార్యక్రమంలో నాయకపొడు రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు