Breaking News: కరకగూడెం ఆగస్టు 04 వై న్యూస్ తెలుగు
కరకగూడెం మండలం పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కారణంగా 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన బిలపాటి రాంబాబు తన చిన్న కొడుకు బిలపాటి నరేందర్‌ను నారిమడి లోకి నీటికి పంపేందుకు మోటార్ వేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 454