పలాస, ఆగస్టు3 వై 7 న్యూస్;
పలాస మండలానికి చెందిన సుమ్మదేవి గ్రామస్తుడు దున్న బాలకృష్ణ అనే దివ్యాంగుడు తనను సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో వేధిస్తున్నాడని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తూ, పరువునష్టం కలిగించేవిధంగా
వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ మంత్రి అప్పలరాజు కూడా సోషల్ మీడియా వేదికగా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వి. అనిత దృష్టి సారించి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Post Views: 24