పలాస, ఆగస్టు 3 | వై 7 న్యూస్
పలాస మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభాపురం సమీప శివాజీ నగర్‌లో శనివారం రాత్రి ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెడ్కానిస్టేబుల్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబీకుల సమాచారం మేరకు కాశీబుగ్గ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ప్రకారం అతడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, ఆ బాధ తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 15