బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 10:30 గంటలకు కార్యక్రమం
మణుగూరు, ఆగస్టు 3 (వై 7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పసుపులేటి వీరబాబు కు మణుగూరులో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సంఘం నాయకులు తెలిపారు.రేపు ఆదివారం ఉదయం 10:30 గంటలకు మణుగూరులోని బీసీ సంఘం ఆఫీసు వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. మండలంలోని బీసీ కులాల బాంధవులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, సామాజిక నాయకత్వాన్ని ప్రోత్సహించాలని మణుగూరు బీసీ సంఘం కమిటీ పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమానికి బీసీ సంఘం మండల అధ్యక్షులు, మహిళా కమిటీ సభ్యులు, బీసీ యువజన నాయకులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. జిల్లా స్థాయి పదవిని అధిరోహించిన వీరబాబు ను మణుగూరు బీసీ బంధువులంతా సన్మానించడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు.జై బీసీ… జై జై బీసీ అనే నినాదాలతో బీసీల ఐక్యతను ప్రదర్శిస్తూ జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.