పలాస ఆగస్టు 2 వై 7 న్యూస్;
టీడీపీ మహిళా ఎమ్మెల్యే శిరీష పేర్కొన్న దాని ప్రకారం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం మరోసారి ప్రజల ముందుకు వచ్చిందని విమర్శించారు.శనివారం పలాస టీడీపీ కార్యాలయంలో జరిగిన వేలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ,మహిళను కించపరిచేలా ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నిర్దాక్షిణ్యంగా ఖండించాలి. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్ వెళ్లడమే అతని మహిళల పట్ల గల అసలైన ధోరణిని చూపుతుంది” అని మండిపడ్డారు.ప్రశాంతి రెడ్డి వరసకు జగన్ సోదరి అయినప్పటికీ, ఆమెను కించపరిచిన వ్యక్తిని పరామర్శించడమంటే మహిళల పట్ల తక్కువగా చూసే మనస్తత్వానికి నిదర్శనం” అని ఆమె అన్నారు.
Post Views: 16