బాన్సువాడ ఆగస్టు 1 వై సెవెన్ న్యూస్
కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో లోక్ షాహ బావు సాటే 105వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా బహు సాటే జెండాను కోటగిరి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్ అన్నా బావు సాటే జెండాను ఆవిష్కరించారు. అన్నా బావు సాటే చిత్ర పటానికి పూల మాలలు వేసి తదనంతరం బాణ సంచాలు తేలుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఒక పండుగ వాతావరణం కనిపించింది..ఈ సంద్భంగా నిజామాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె .పోచిరామ్ మాట్లాడుతూ అన్నా బహు సాటే అసలు పేరు తుకారాం బావు రావు సాటే ఆయన
1920 ఆగస్టు 1 నా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ గ్రామ మాతంగి సామాజ్ కు చెందిన వాలు భాయ్ బాబురావు సాట్ కు జన్మించారు.
ఆయన గొప్ప కవి, రచయిత
లోక్ షాహీర్ అని పేరు పొందారు
ఆశయాలను ఆయన పాటల రూపంలో రచనల రూపంలో ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ అన్న బాహూ సాటే అని అన్నారు రచన లతో మరాఠీలో ఎన్నో సినిమాలు తీశారు.
ఈయన రచనలలో అత్యంత ప్రసిద్ధి పొందిన రచన ఫకీర నవలలో మహారాష్ట్రలో టాప్ లీడర్ అవార్డు అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈయన రచించిన రచనలతో రష్యా దేశ ప్రధాని అన్న బహు సాటే ను ఘనంగా సన్మానించారు. ప్రతి గ్రంధాలయాలు ఆయన విగ్రహాలను ప్రతిష్టాపించి రష్యాలో ఇప్పటికీ యూనివర్సిటీ పాఠ్యాంశాలు కొనసాగుతున్నాయని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రేని సాయిలు, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కన్నం సాయిలు,పేగు లాలయ్య,హస్గుల లాలయ్య, హెగ్డేలి శంకర్, హోటల్ యాదవ్, కరికేల్లి సంజువ్, గంగారం కన్నం పోశెట్టి, ఎక్లాస్ పూర్ శ్రీకాంత్, ఎత్తోండ సాయిలు, సుంకిని రాజు తదితరులు పాల్గొన్నారు.