అశ్వాపురం, ఆగస్ట్ 1 వై 7 న్యూస్;
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా మీడియా వర్గాల్లో మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు అశోక్ కుమార్ తోట స్పందిస్తూ, “జర్నలిజం రంగంలో మార్పు రావాలంటే, అది రాజకీయ వ్యవస్థ నుంచి మొదలవ్వాలి” అని చెప్పారు.
“నేటి రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలంటే కనీసం డిగ్రీ అర్హత తప్పనిసరి కావాలి. వార్డు మెంబర్ నుండి సర్పంచి వరకు, ఎమ్మెల్యే నుండి ముఖ్యమంత్రి వరకు విద్యావేత్తలే పాలనలోకి రావాలి. అప్పుడు మాత్రమే దేశం గానీ రాష్ట్రం గానీ సక్రమంగా అభివృద్ధి చెందగలుగుతాయి” అని అశోక్ కుమార్ ఆవేదనతో తెలిపారు.
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు కావలసిన మార్గమని, బద్ధక రాజకీయాలకు తెరదించాలంటే చదువుతో కూడిన నేతలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.