E-PAPER

రోడ్డు మరమ్మత్తుల పర్యవేక్షణలో కాంగ్రెస్ నాయకులు

రోడ్డు మరమ్మతులు చేపించిన ఎమ్మెల్యే పాయం

మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్

మణుగూరు,ఆగస్టు 01 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండల పరిధిలో గల లారీ ఆఫీస్ నుండి చిక్కుడుగుంట వరకు బీటీ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పడిన విషయం తెలిసిందే..ఈ మార్గంలో లారీలుమరియు ఇతర వాహనాల తో పినపాక తదితర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తూ ఈ గుంతల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టిసారించి వెంటనే స్పందించి R&B అధికారులకు వెంటనే రోడ్డు మరమ్మత్తు చేయాలని ఆదేశించడం జరిగింది..వెంటనే మరమ్మతులు ప్రారంభించిన R&B అధికారులు పనుల పర్యవేక్షించిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీరినాకి నవీన్ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తుల చేపించిన ఎమ్మెల్యే పాయం కు మండల ప్రజల తరుపున సంతోషం వ్యక్తం చేస్తు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు శివ సైదులు పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి 14టైర్ లారీ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి , తుపూడి శ్రీను, రహీం పాషా, మానుకొండ రామకృష్ణ, గివిందు, భారత్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్