కమలం వికసించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్న నేతలు
అన్నపురెడ్డిపల్లి, జూలై 29 (వై సెవెన్ తెలుగు న్యూస్):
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా నారపరాజు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అతిధిని స్వాగతించేందుకు సన్నద్ధమవుతున్నారు.అన్నపురెడ్డిపల్లి మండలంలోని అబ్బుగూడెం గ్రామం నుంచి బీజేపీ నాయకులు మొగిలి రామకృష్ణ, బన్నే శ్రీను నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, యువత, మహిళా శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. కమలదళం జెండాలు, నినాదాలతో ఊగిపోతున్న ఈ ర్యాలీ పట్ల స్థానికంగా మంచి ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ
నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోంది. అదే విధంగా, తెలంగాణలో నారపరాజు రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అందుకోసం కార్యకర్తలందరం నూతన ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళా శ్రేణులు పాల్గొన్నారు.