బాన్సువాడ, జూలై 29 (వై 7 న్యూస్):
బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యులు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్ మండల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని పరిశీలించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,
గ్రామీణ యువత వ్యవసాయ విద్యలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రుద్రూర్ మండల కేంద్రంలో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు వలన ఈ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు మెండుగా లభిస్తాయి. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, పరిశోధన కేంద్రాధికారి సమత పరమేశ్వరి, రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రిపోర్ట్: గంగారం