అన్నపురెడ్డిపల్లి, జూలై 29 (వై 7 న్యూస్ ప్రతినిధి);
అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) నందు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జాతీయ నయీ తాలిం సమితి జాతీయ అధ్యక్షురాలు పి. ఉషారాణి ప్రారంభించారు.
ఈ గ్రంథాలయ ఏర్పాటుకు ప్రవాస భారతీయ వాసవీ సంఘం (NIRVA) మరియు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నుంచి రూ. 37,968 విలువగల పుస్తకాలు విరాళంగా అందాయి. విద్యార్థుల చదువుకు అవసరమైన వివిధ శాస్త్రీయ, సాహిత్య, సామాజిక అంశాలపై ఆధారిత గ్రంథాలను అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యు. ఆనందకుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు శాంతకుమారి, రాజ్యలక్ష్మి, పద్మ సుశీల, మోతీలాల్, జయరాం, మీరా హుస్సెయిన్, శ్రీనివాసరావు, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, సీఆర్పీలు శిరీష, నాగమణి, సీసీఓ రమణ తదితరులు పాల్గొన్నారు.