E-PAPER

తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నాగుల పంచమి వేడుకలు

తూప్రాన్ జులై 29. వై 7 న్యూస్

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నాగుల పంచమి సందర్భంగా గుడికి వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఎల్లమ్మ గుడి నిర్మించిన ప్రజా సేవకులు దాతలు కళమ్మ మరియు వెంకటేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ స్వయంగా దైవభక్తితో ప్రజాసేవలో భాగంగా కాలనీలో ఒక గుడి నిర్మాణం ఉండాలనే ఉద్దేశంతో ఎల్లమ్మ గుడిని నిర్మించామని అయితే అట్టి గుడికి తమ శాయశక్తుల నిర్మాణ వ్యయం వెచ్చించామని అట్టి గుడి పరిసరాలు సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే దాతలు ముందుకు వచ్చి ఇట్టి గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థలాన్ని విస్త్రీకరించి అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందించాలని మీడియా ద్వారా కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్