E-PAPER

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పారిశుద్ధ్య లోపం

కుక్కల స్వైర విహారంతో ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

తూప్రాన్ జులై వై 7 న్యూస్29

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పారిశుద్ధ్య లోపంతో దోమలు ఈగలు విజృంభించడంతో మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల కేసులు పెరిగే అవకాశం ఉంది పిల్ల చుట్టుపక్కన ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగడంతో వలన విష సర్పాలు తేళ్లు జెర్రీలు లాంటివి ఇళ్లల్లోకి రావడంతో స్థానికంగా ఉంటున్న కాలనీవాసులు రోజురోజు బిక్కుబిక్కుమంటు గడుతున్నారు ఇట్టి విషయమై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పైపై మాత్రమే పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు దీంతోపాటు కాలనీలో కుక్కల స్వైర విహారం ఇంకా భయంతో గురవుతున్నామని కాలనీవాసులు చెప్పారు కాలనీ నుండి రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలిబాటను నడిచే పోయే పాఠశాల విద్యార్థులు ఉద్యోగరీత్యా వెళ్లే గృహిణులు కుక్క కాటుకు గురై ఇబ్బందులు గురవుతున్నారు మున్సిపల్ పరిధిలో మేము లేమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక అధికారుల పరిపాలన కాలంలో ఇక్కడ మాకు సౌకర్యాలు రక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పరిపాలన అధికారి స్పందించి కాలనీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మీడియాతో కాలనీవాసులు మొరపెట్టుకున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్