E-PAPER

పలాస వద్ద రోడ్డు ప్రమాదం

పలాస, జూలై 20 వై 7 న్యూస్;

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని కొత్త పరసాంబా గ్రామ సమీప జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుండి ఒడిశా రాష్ట్రంలోని భరంపురం దిశగా పామాయిల్ రహదారిలో వెళ్తున్న ఓ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సెన్సార్ బోర్డును ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం ఊపిరి పీల్చేలా చేసింది. ప్రమాదవశాత్తు లారీ ఢీకొన్న సెన్సార్ బోర్డు జాతీయ రహదారి మీదే పడిపోయింది. సమాచారం అందుకున్న హైవే పోలీస్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను నియంత్రించారు. భద్రతా చర్యలు చేపట్టి, రహదారి పై నుంచి బోర్డును తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.

ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగా ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్