కరకగూడెం, జూలై 20 వై 7 న్యూస్ తెలుగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ఎస్.సి కాలనీలో నివసిస్తున్న నైనారపు పెద్దలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి దశదిన కర్మలు జరుపుకోవాల్సిన సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతుండగా, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందించారు.
పేదవారి బాధను తనవిగా భావించి, ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ఇక్బాల్ హుస్సేన్ ను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, కార్యకర్తలు, పెద్దలు, మరికొంతమంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇలాంటి మానవీయ సేవా కార్యక్రమాలు సమాజంలో పరస్పర సహాయ సహకారాలను పెంపొందించడమే కాక, రాజకీయ నాయకుల్లో ఉన్న మానవతా విలువలను కూడా ప్రతిబింబిస్తాయి.
Post Views: 50