E-PAPER

మణుగూరు మండలంలో ప్రైవేట్ పాఠశాలలు, మెడికల్ షాపుల అక్రమాలు – మహిళా మండలి ఫిర్యాదు

మణుగూరు: జూన్ 17 వై 7 న్యూస్

మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ వారి సభ్యులతో కలిసి మండల విద్యాశాఖ అధికారి స్వర్ణ జ్యోతి కి వినతిపత్రం ఇచ్చారు.
వారు మాట్లాడుతూ మెడికల్ షాపులు ఔషధాలను అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు, అనర్హుల చేత ఔషధ విక్రయం జరగడం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నదని పేర్కొన్నారు.
అలాగే, ప్రైవేట్ పాఠశాలలు విద్యా సామగ్రి (పుస్తకాలు, బ్యాగులు, షూస్)ను బలవంతంగా కొనమని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తూ, బిల్లుల్లేని లావాదేవీలు జరుపుతున్నట్టు తెలిపారు.’సత్య భాస్కర’ అనుమతిని వినియోగించి ‘మాంటిస్సోరీ స్కూల్’ పేరిట పాఠశాల నడుపుతూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి’ అని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో అధికారులు తక్షణ విచారణ చేపట్టి, సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో షబానా,శ్యామల,సౌజన్య,రేణుక నాంపల్లి రమ
తదితరులు పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News