E-PAPER

రైతు భరోసా నిధుల విడుదలపై యువ నేత చింతిరాల అరుణ్ రాజ్ కృతజ్ఞతలు

భద్రాచలం, జూన్ 17 వై 7 న్యూస్;

భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చింతిరాల అరుణ్ రాజ్ మాట్లాడుతూ “రైతుల సంక్షేమం కోసం చారిత్రాత్మకంగా రైతు భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

వాణాకాలం సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ, మొదటి రోజు 2 ఎకరాలు ఉన్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,349.83 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. ప్రతి ఎకరాకు సంవత్సరానికి ₹12,000 రైతు భరోసా అందించేందుకు ఎకరాల పరిమితి లేకుండా వ్యవస్థను రూపొందించడం రాష్ట్ర చరిత్రలో తొలి మైలురాయి అని అన్నారు.

అంతేకాకుండా, సన్నధాన్యం రైతులకు క్వింటాల్‌కు ₹500 బోనస్గా ₹1,199 కోట్లు విడుదల చేయడం రైతులకు నిజమైన ఆర్థిక ఉపశమనం.బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ల పాలనలో రైతులను నిర్లక్ష్యం చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతును ప్రేమించే ప్రభుత్వం, రైతు కోసం నిలిచే ప్రభుత్వంగా నిలుస్తోంది.”రైతు అంటే కాంగ్రెస్ – కాంగ్రెస్ అంటే రైతు” అని భద్రాచలం నియోజకవర్గ యువ నాయకుడు చింతిరాల అరుణ్ రాజ్ గారు స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News