E-PAPER

మణుగూరు అంబేద్కర్ సెంటర్లో వాహన తనిఖీలు

మణుగూరు, మే 29:

స్థానిక అంబేద్కర్ సెంటర్లో నూతనంగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.నాగబాబు మరియు ఎస్‌ఐ మేడాప్రసాద్ నేతృత్వంలో గురువారం సాయంత్రం పోలీస్ సిబ్బంది భారీ స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు సిఐ  తెలిపారు. వాహనాలు, డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్సులు తదితరాల తనిఖీలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రజల సహకారంతోనే నేరాలను నియంత్రించగలమని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ మేడాప్రసాద్ విజ్ఞప్తి చేశారు.తనిఖీల్లో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News