మణుగూరు, మే 26:
మణుగూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ విశేష సేవలందించిన పోలీస్ అధికారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు బదిలీ అయిన G. హరీష్ ను మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ వి. రవీంద్ర రెడ్డి, సీఐ వెంకటేశ్వరరావు, డీఎస్పీ ఆఫీసు సిబ్బంది లోని సామల వెంకటేశ్వర్లు (హెడ్ కానిస్టేబుల్), రాజ్ కుమార్ (కానిస్టేబుల్), వేణు (కానిస్టేబుల్), శంకర్ (హోంగార్డు) తదితరులు పాల్గొని హరీష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.హరీష్ నిబద్ధత, వినయవంతమైన ప్రవర్తన, విధి పట్ల అత్యంత కట్టుబాటును ఈ సందర్భంగా అధికారులు ప్రశంసించారు. కొత్త స్థానంలో మరింత ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు.
Post Views: 141









