సుష్మా హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ సింహ నేతృత్వంలో విజయవంతం
ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త,లయన్ బుడ్డ భాగ్యరాజ్, లయన్ డాక్టర్ అప్సర్
తూప్రాన్, మే,26. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ను సోమవారం ఉదయం సుష్మా హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ సింహ నేతృత్వంలో విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ బాబు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అత్యంత నిష్ణాతులైన మల్టి సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఆన్ లైన్ కన్సల్ట్ చేయించి ప్రామాణికమైన వైద్యం అందించే విధంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా రోగులకు అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి మరింత మెరుగైన చికిత్స కోసం రీ ఎక్స్పర్ట్ ఆన్ లైన్ కన్సల్ట్ చేయించి సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ సంస్థ సేవలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, లయన్ బుడ్డ భాగ్యరాజ్, లయన్ డాక్టర్ అప్సర్ భాయ్, లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్, తోపాటు రీ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ-క్లినిక్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ ఆనంద్ బాబు, విశ్వశాంతిరెడ్డి, హర్ష, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.









