E-PAPER

గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెo

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు…

లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన వనపర్తి వీరభద్రం s/o గోపయ్య వ్యవసాయం సరిగా కలిసి రావట్లేదని కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉన్నదని నాకు 68 సంవత్సరాలు వచ్చాయని వృద్ధాప్య పెన్షన్ ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కి ఎండార్స్ చేశారు.

పాల్వంచ శ్రీనగర్ కాలనీ ఐదో వార్డుకు చెందిన ప్రజలు శ్రీనగర్ కాలనీలో ఇంతకుముందు రెండువైపులా సిమెంట్ రోడ్డు వేశారని ఈ రోడ్డుల మధ్య కలవర్టర్ నిర్మించలేదని దీనివలన శ్రీనగర్ కాలనీ విద్యార్థులు స్కూలుకు మరియు కొత్తగూడెం వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని మున్సిపాలిటీ ఏఈ గారు వచ్చి కొలతలు వేసుకొని వెళ్లినారని ఇంతవరకు పని మొదలు పెట్టలేదని రెండు సిమెంట్ రోడ్ల మధ్య కల్వర్టరు నిర్మించాల్సిందిగా కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారు.

అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామంలో నివాసము ఉంటున్న రైతులు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద భూములు పైన తమకు నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్మును గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరియు బ్యాంక్ సిబ్బంది కలిసి షరాసులైన తమను మాయమాటలు చెప్పి పోడు భూములకు పట్టాలిపిస్తాం, కోడి భూముల్లో బోరు వేయిస్తాం వాటికోసం మీరు బ్యాంకుల్లో సంతకాలు చేయాలని నమ్మబలికి, బ్యాంకు వద్దకు తీసుకువెళ్లి, తమకు ప్రభుత్వం ద్వారా వచ్చిన నష్టపరిహారం డబ్బును వారి యొక్క వ్యక్తిగత ఖాతాలకు పదలాయింపు చేసుకున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ సొమ్మును తమకు ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం జిల్లా ఎస్పీకి ఎండార్స్ చేయడం జరిగింది.

బూర్గంపాడు మహా మండలం దుర్గంపాడులో నివాసం ఉంటున్న తోకల నాగులు s/o తోకల పిచ్చయ్య (లేటు) బూర్గంపాడు గ్రామంలో సర్వేనెంబర్ 14/1 మూడు ఎకరాల 22 కుంటలు రేగడిగిన ఇనం పట్టా భూమి తన తండ్రి గారైన తోకల పిచ్చయ్య వారి పేరు మీద ఉన్నదని, మా తండ్రిగారు చనిపోయారని, కావున భూమి యొక్క కుల పత్రమును తన పేరు మీదకు మార్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు ఈ సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు.

చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న డేగల తిరుపతి S/o మల్లయ్య 20 సంవత్సరాల క్రితం మణుగూరు సమితి సింగారం గ్రామంలో మూడు సెంట్ల స్థలంలో రేకుల కప్పు తోటి ఉన్న ఇంటిని కొనుగోలు చేశానని, ఇప్పుడు ఆ ఇంటి పక్కన ఉంటున్న కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు, స్థలంలో ఉన్నటువంటి రేకుల ఇంటిని కూల్చి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, ఎందుకు అని ప్రశ్నించగా భయభ్రాంతులకు చేస్తున్నారని దయచేసి యొక్క ఆస్తిని నాకు ఇప్పించగలరని చేసిన దరఖాస్తులను పరిశీలించి, తగు చర్యలు అయితే అధికారికి ఎండార్స్ చేశారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్