భద్రాద్రి, మార్చి 10, వై 7 న్యూస్ తెలుగు;
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) తో విద్యాబోధన విద్యార్థుల కు వరంగా మారనున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీ ఎస్ పాఠశాలల్లో ఏఐతో విద్యా బోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల అభ్యాసన మరింత ఆకర్షణీయంగా, ఇంట్రాక్టివ్ గా నిర్వహించటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగ్గా సహకరిస్తుందన్నారు. దీంతో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తూ.. అందుకు తగినట్లు అభ్యాస కృత్యాలు జనరేట్ చేయడంతో విద్యాభ్యాసం పట్ల పిల్లల్లో మరింత ఉత్సాహం పెంచేలా బోధన చేయవచ్చు అన్నారు. విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్ లో కలెక్టర్ ముచ్చటిస్తూ చిన్నారులకు ఉత్సాహమే ప్రేరణగా ఆధారిత విద్యాబోధనను జిల్లాలో ప్రారంభించామన్నారు. కనుక పిల్లలందరూ నిరంతరంగా ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్ ను వినియోగించాలని అన్నారు. బూర్గంపాడు మండలంలో అంజనాపురం, మొరంపల్లి బంజారా, బూర్గంపాడు 2, నాగినేని ప్రోలు మరియు సారపాక లోని గాంధీనగర్ పాఠశా లలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఏఐ ఆధారిత బోధన లో భాగంగా మండలం నుంచి ఒక ఉపాధ్యాయుని హైదరాబాదుకు ఏఐ విద్యా బోధనలో శిక్షణకు పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత విద్య బోధనలో ఉపాధ్యాయుల తీరును సంబంధిత ఎంఈఓ లు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని రోజువారీగా సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ బూర్గంపాడు ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.* సందర్భంగా కలెక్టర్ పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, కిషన్ షెడ్ పాఠశాల ఆవరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యా తరగతులను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థుల కు పుస్తక పఠనంలో ఉన్న నైపుణ్యాన్ని హిందీ పాఠ్యపుస్తకాన్ని చదివించి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారికి గల ఆసక్తి పాఠ శాలలో విద్యాబోధన, అమలు చేస్తున్న మెనూపై ఆరా తీశారు. విద్యార్థుల సం ఖ్య, పాఠశాలలో రోజు వారి అమలు చేస్తున్న మెనూ ప్రకారం, లెసన్ ప్రణాళికలు, టాయిలెట్స్ నిర్వహణలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదవటానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నీరు నిల్వ లేకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కావలసిన ప్రణాళికలను రూపొందించి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
మొరంపల్లి బంజర్ లో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు.* ఈ సందర్భంగా కలెక్టర్ మొరంపల్లి బంజరు లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాపనకు వేపల గడ్డ బస్టాండ్ సమీపంలో సూచించిన నాలుగు ఎకరాల భూమిని పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట బూర్గంపాడు డిప్యూటీ తాసిల్దార్ నరేష్, బూర్గంపాడు ఎంఈఓ, పాఠశాలల సిబ్బంది మరియు విద్యార్థులు, మందిత అధికారులు పాల్గొన్నారు.