E-PAPER

హత్యకేసు ను ఛేదించిన పోలీసులు

మణుగూరు, మార్చి 03(వై 7 న్యూస్)

మణుగూరు మండలం లో దుర్గా కంపెనీ లో పనిచేసే యువకుడి హత్య కేసు మిస్టరీ ను పోలీసులు చేదించి నిందితుడిని అరెస్టు చేశారు.ఈ మేరకు మణుగూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, సిఐ సతీష్ కుమార్, ఎస్సై మేడ ప్రసాద్, ఎస్సై రంజిత కుమార్ ,నిందితుడి వివరాలు వెల్లడించారు.
ఫిబ్రవరి 27 న రాత్రి మణుగూరు దుర్గా ఓసి కంపెనీ లో మెకానిక్ హెల్పర్ గా పనిచేయుచున్న మధ్యప్రదేశ్ కు చెందిన ముని ప్రసాద్ విశ్వకర్మ క్యాంపు సమీపంలో హత్యకు గురి అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై 28.2.2025 దుర్గా కంపెనీ మేనేజర్ ముత్తు కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్. దర్యాప్తులో భాగంగా మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ లతో క్యాంపు చుట్టుపక్కల అనుమానితుల ఆధారాల కోసం వెతకడం జరిగింది. ఎస్సై ప్రసాద్, ఎస్సై రంజిత్, ట్రైని ఎస్సై మనీషా లతో మూడు బృందాలుగా ఏర్పడి చుట్టుపక్కల బెల్ట్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో మృతుడు తిరిగిన చోట్ల సీసీ కెమెరాలలో అనుమానితుల గురించి వెతకడం జరిగింది.ఈ క్రమంలో మార్చి 2 న ఈ కేసులో అనుమానితులు గా ఉన్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన పరమ్ వినోద్ సింగ్(19) మహదివ్య గ్రామం, గోగాంబ మండలం, గుజరాత్ (పంచ మహా జిల్లా) గుజరాత్ (రాష్ట్రం) తగిన ఆధారాలతో విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది.

వివరాల్లోకి వెళితే తేది 27.02.25 రాత్రి 7 గంటలకు నేరస్థుడు మరియు మృతుడు తమ డ్యూటీ ముగించుకొని మణుగూరు పూల మార్కెట్ ఏరియాలో బెల్ట్ షాపులో మద్యం మరియు ఫ్రైడ్ రైస్ తీసుకొని క్యాంపు దగ్గరలో గల కాలువలో మద్యం సేవిస్తుండగా ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగి కోపోద్రిక్తుడైన వినోద్ సింహ మద్యం మత్తులో ముని ప్రసాద్ తలపై బలంగా మోదడం వలన ముని ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు.ఇట్టి కేసును చేదించిన ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తో పాటు అతనికి సహకరించిన ఎస్సైలు ప్రసాద్, రంజిత్ మరియు ట్రైనీ ఎస్ఐ మనీషా సిబ్బంది వీర, షమీం, రామారావు లను డీఎస్పీ అభినందించడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్