E-PAPER

డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ,మార్చి1 వై 7 న్యూస్ తెలుగు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం లో డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో రివర్ హాస్పిటల్ ను ఓపెన్ చేసిన స్థానిక ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమావత్ శంకర్ నాయక్. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండాలని నిరంతరం అంకితభావం కలిగిన వైద్యులతో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించి 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. మిర్యాలగూడ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉండటం వలన వారికి చికిత్సలో ఫీజుల భారం మోపకుండా టెస్టుల భారం మోపకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, హాస్పిటల్స్ సిబ్బంది అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,సతీష్ కుమార్, సత్య, డాక్టర్ మునీర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్