కరకగూడెం,డిసెంబర్ 25 వై 7 న్యూస్;
కరకగూడెం ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ళ రోజు రోజుకు కొత్త రూపులు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
వాట్సప్ గ్రూపులో చొరబడి అడ్మిన్ గా ఉన్న వారిని తొలగించి అడ్మిన్ గా వారు ఉంటూ,గ్రూప్ అందరికీ నమస్కారం హర్ష సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆఫర్ ఇస్తున్నామని ఫూర్ ఫ్యామిలీ కి చేస్తున్న ఆఫర్ ఇది అని గ్రూపులో ఎంత మంది ఉన్న అంత మందికి ఆఫర్ ఇస్తున్నామని,రూ, 2000 వేలు పే చేసిన వారికి రూ, 18,500 వేస్తున్నామని మీరు వేసిన 5 నిమిషాల్లో అమౌంట్ వేస్తామని కావాలి అనే వారు మెసేజ్ చేయండని,డోంట్ మిస్ ఆఫర్ ఎవరు కూడా మిస్ అవకండి 20 మందికి మాత్రమే అని గ్రూపులో ఫేక్ పోస్టులు పెడుతూ,కొత్త పద్దతులలో నేరాలకు పాల్పడుతున్నారని ప్రజలు నమ్మ వద్దని తెలిపారు.ఇలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపారు.