యు.కొత్తపల్లి,డిసెంబర్25 (వై 7న్యూస్ ప్రతినిధి);
ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సీఐ శ్రీనివాస్ అన్నారు బుధవారం అమీనాబాద్ సెంటర్లో గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఇటీవల కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తుల నుండి ఫోన్లు చేసి మీకు లోన్లు, డ్రాలు వంటి ఎంపికయ్యారని తెలిపితే అలాంటి ఫోన్లను నమ్మవద్దని తెలిపారు మొబైల్ లో యాపల ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయని తెలియని యాప్ లను క్లిక్ చేయకుండా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎస్సై వెంకటేష్, పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post Views: 34