E-PAPER

బలగం మొగిలయ్య’ మృతి

వరంగల్,డిసెంబర్19 వై 7 న్యూస్

బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన ఆయన గ‌త కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మృతి చెందాడు. కాగా, జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం బ‌లగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్