మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి
మణుగూరు,డిసెంబర్ 19 వై 7 న్యూస్;
మణుగూరు సింగరేణి ఏరియా ఓ సి 2 నందు గురువారం ఉదయం మొదటి షిఫ్ట్ నందు 100 టన్ డంపర్ పల్టీ పడి సింగరేణి కార్మికుడు మూల్ చంద్(60) అనే డంపర్ ఆపరేటర్ మృతి చెందడం అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమైన అంశం అని మరో 7 నెలల్లో పదవీ విరమణ పొందే కార్మికుడు అనుకొని సంఘటన వల్ల మృత్యువాత.పడటం దురదృష్టకరమని తెలిపారు..ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకొని వెంటనే స్ధానిక సింగరేణి వైద్యశాలకు చేరుకున్న ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ బాధితుడికి మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ హాస్పిటల్ కు పంపించే క్రమంలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోవడం బాధాకరమని తెలిపారు..నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలసాధనలో రక్షణకు అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చే మణుగూరు ఏరియాలో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పై యాజమాన్యం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. మృతుడి కుటుంబానికి టి బి జి కె యస్ అండగా నిలుస్తుందని కార్మిక కుటుంబానికి సింగరేణి సంస్ధ నుంచి చెల్లించవలసిన మొత్తాలను వారి కుటుంబ సభ్యులకు త్వరితగతిన అందించాలని మృతుడి కుటుంబాల్లో అర్హులైన వారికి వెంటనే వారు కోరిన చోట వారి విద్యారతను తగ్గట్టుగా ఉద్యోగ అవకాశం కల్పించాలని తెలిపారు.. సంస్ధ సి యం డి బలరాం ప్రవేశపెట్టిన కోటి రూపాయల ప్రమాద బీమా ను బ్యాంకర్లతో మాట్లాడి మృతుడి కుటుంబానికి అందించేలా యాజమాన్యం దృష్టి సారించాలని సూచించారు 2024_25 అర్ధిక సంవత్సర చివరిలో అనుకోకుండా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకొని కార్మికుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన అంశం అని ఏది ఏమైనా ఏరియాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగకుండా సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మూల్ చంద్ పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ఆయన ప్రార్థించారు