గోదావరి సరిహద్దు గ్రామాల్లో ముమ్మర తనిఖీలు
పినపాక,డిసెంబర్06 వై 7 న్యూస్;
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలో అపరిచిత వ్యక్తులు, అనుమానితులు, తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం గోదావరి సరిహద్దు గ్రామాలైన చింతల బయ్యారం, రావిగూడెం గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. స్థానికులతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని , కొత్త వ్యక్తులు గోదావరి దాటి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరించారు. రాత్రి వేళల్లో పడవలు నడపకూడదని సూచించారు. సందర్భంగా చేగర్శల, ఐలాపురం, వెంకట్రావు పేట గ్రామాల కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానితుల సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిజిపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 81