బూర్గంపాడు, డిసెంబర్ 6 వై సెవెన్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తెలంగాణ ఆటో యూనియన్
జే ఏ సి ఆధ్వర్యంలో ఆటోలు నడిపే కార్మికులు స్వచ్ఛంగా డిసెంబర్ 7 తారీఖున ఆటోలు బందుకు పిలుపునివ్వడంతో బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ఆటో జేఏసీ పిలుపు మేరకు ఆటోలు 7 తారీఖున బంద్ చేయాలని పిలుపునిచ్చిన బూర్గంపాడు ఆటో యూనియన్ అధ్యక్షులు.బూర్గంపాడు ఆటో యూనియన్ అధ్యక్షులు సాధిక్ పాష, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం అధ్యక్షులు శ్రీను, క్రాస్ రోడ్ అధ్యక్షులు సాంబ, ఇర వెండి అధ్యక్షులు వెంకటేశ్వర్లు, లక్ష్మీపురం అధ్యక్షులు వెంకన్న, మొరంపల్లి బంజర అధ్యక్షులు పవన్, సార పాక గాంధీనగర్ అధ్యక్షులు జానీ, నరసింహారావు, సారపాక టౌన్ అధ్యక్షులు సయ్యద్ టిప్పు సుల్తాన్, ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ఆటోలకు బందుకు పిలుపునివ్వగా ముఖ్యఅతితులుగా పాల్గొన్న జేఏసీ భద్రాచలం, బూర్గంపాడు, అధ్యక్షులు అమీర్ పాష, బూర్గంపాడు మండల అధ్యక్షులు ఎమ్మెస్ కే. అబ్దుల్లా, మండల వైస్ ప్రెసిడెంట్, సయ్యద్ టిప్పు సుల్తాన్, మండల ప్రధాన కార్యదర్శి సాధిక్ పాష, మరియు బూర్గంపాడు మండలంలో ఉన్న తొమ్మిది అడ్డాల యూనియన్ సభ్యులు ఆటోకార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
