జుక్కల్ డిసెంబర్ 06 వై 7న్యూస్ తెలుగు
జుక్కల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సురేష్ గొండ మాట్లాడుతూ
ఈనెల 10న హైదరాబాదులో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మహా ధర్నా జయప్రదం చేయాలని సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ వికలాంగ సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగ సోదరులకు 6000 పెన్షన్ ఇస్తామన్న హామీ తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కార్పొరేషన్ ద్వారా చదువుకున్న వికలాంగ సోదరి సోదరులకు ఐదు లక్షల రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో చదువుకొని ఉన్న వికలాంగ సోదరి సోదరులకు వీరికోట ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించాలని వికలాంగ సోదరి సోదరులకు. వారవులైన వారందరికీ మూడు చక్రాల రిక్షా,మూడు చక్రాల స్కూటీ,వికలాంగులకు సంబంధించిన కిట్లను ఈ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సురేష్ గొండ డిమాండ్ చేశారు.