E-PAPER

సాంఘిక సంక్షేమ బాలిక గురుకుల విద్యాలయంలో ఉచిత దంత వైద్య శిబిరం

బాన్సువాడ డిసెంబర్ 06 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట లో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం,సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో మేరా యువ హీరో భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా రాకేష్ దంత వైద్యశాల వారి సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ పిల్లలందరికీ దంత పరీక్షలు నిర్వహించి పళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్నిసార్లు పళ్ళు తోముకోవాలి, దంతాలకు ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి ,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఎన్నో విషయలను కులం కూషంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నెహ్రు యూవ కేంద్ర మాజీ వలేంటిర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ మానవ సేవయే మదవా సేవా తోటి మనిషికి మనకు తోచినంత సేవా చేసినా నాడే మన జన్మకు అర్తం తోటి మనిషి కష్టాల్లో ఉన్నపుడే ఆదుకున్న వాళ్లే దేవుళ్ళు అంటారు .భగవంతుడు ఎక్కడో లేడు మనిషిరూపంలో ఎలాంటి లాభం ఆశించ కుండా సహాయం చేసేవాళ్ళే కావున ప్రతి ఒక్క విద్యార్థి సేవా భావాన్ని అలవర్చుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ సునీల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :