కోటగిరి డిసెంబర్ 1 వై సెవెన్ న్యూస్ తెలుగు
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగాల చేసిన పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తనకు ఉద్యోగం ముఖ్యం కాదు .తన ఒక ప్రాణం పోతే లక్షల మంది యువతకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉపాధి దొరుకుతుందని ఆశించి తన ప్రాణ త్యాగం చేసిన కిష్టయ్యకు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి ముదిరాజ్ సంఘం.పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15 వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటగిరి మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో15వ వర్ధంతి జరపడం జరిగింది. బాన్సువాడ డివిజన్ ఇన్చార్జి డాక్టర్ సాయిలు ముదిరాజ్. బాన్సువాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి గణేష్ ముదిరాజ్ నిజామాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు కప్ప గణేష్ ముదిరాజ్ నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు హంగర్గ స్వరూప గంగాధర్ ముదిరాజ్. కొత్తపల్లి అధ్యక్షులు కోటగిరి సుదర్శన్ ముదిరాజ్. క్లాస్ పూర్ అక్కసాయిలు ముదిరాజ్. రాంపూర్ అధ్యక్షులు కొండాపూర్ సాయిలు ముదిరాజ్. వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యకర్తలు ముదిరాజులు పెద్ద సంఖ్యలు పాల్గొని ఈ15వ వర్ధంతిని జయప్రదం చేశారు.