ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు న్యూ డెమోక్రసీ పార్టీ తరపున వినతి పత్రం
చర్ల,నవంబర్24 వై 7 న్యూస్;
చర్ల మండలంలో ఆదివాసి గ్రామాలు బక్క చింతలపాడు కొరకడుపాడు కిష్టారం పాడు క్రాంతి పురంలో 2015 నుండి ప్రైమరీ స్కూల్ 50 మంది పై బడి విద్యార్థులతో ఇద్దరు టీచర్లు గుడిసెలలో పాఠశాల నడుపుతున్నారు అక్కడ బిల్డింగ్ లేదని,పూరి గుడిసెలో విద్యాభ్యాసం నడిపిస్తున్నదని ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ , పోరాటాలు చేసి ఐటీడీఏ బిల్డింగ్ సాంక్షన్ చేపించాము కానీ దానికి ఫారెస్ట్ వారు అనుమతులు ఇవ్వడం లేదు కావున తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో లో ఎలాంటి అనుమతులు ఆంక్షలు లేకుండా విద్యార్థుల అభివృద్ధికోసం తక్షణమే బిల్డింగ్ నిర్మించాలని కోరుతూ భద్రాచలం ఎం ఎల్ ఏ తెల్ల వెంకటరావుకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా తెల్లం మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే అక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గోన్నారు.