నియంత పోకడలు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు
సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్
కొత్తగూడెం,నవంబర్24 వై 7 న్యూస్
సింగరేణి లారీ అసోసియేషన్ ఎన్నికలు గత మూడేళ్లుగా జరగకుండా అనేక ఇబ్బందులు పడుతూ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాడుకుంటూ అంతిమంగా ఎన్నికల ద్వారానే అసోసియేషన్ అభివృద్ధి సాధ్యమనే గుర్తించి ఐక్యతతో ఎన్నికలు నిర్వహించుకొని ముందుకు పోవాలనుకోవడం హర్షణీయం , అలాంటి పరిణామాలను ప్రజాస్వామ్యవాదులు ప్రజల చేత ఎన్నికల్లో గెలుపొందుతున్న వారు ప్రోత్సహించాల్సింది పోయి ఎన్నికలు నిర్వహించుకునీ ముందుకు పోయేందుకు అసోసియేషన్ అన్ని సిద్ధం చేసుకోగా కొంతమంది వ్యక్తులు తమ పబ్బం గడుపుకునేందుకు తమ పెత్తనం నిలుపుకునేందుకు ఎన్నికలను ఆపడం ప్రజాస్వామ్యమా అని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ అన్నారు. కొంతమంది వ్యక్తులు ప్రజా ప్రతినిధులు బూర్జవ రాజకీయాల కంటే నియంతల కంటే ఎక్కువగా కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి గల్లీలో ప్రతి వార్డులో ప్రతి పనిలో తమ మాట చెల్లాలంటూ రుకుం జారీ చేస్తుండడం బాధాకరం అని ఆయన తెలిపారు. గతంలో కూడా అసోసియేషన్ లో జరిగిన గొడవలకు రాజకీయ కుట్రలు కుతంత్రాలే కారణమని అసోసియేషన్ నాయకులు కూడా గుర్తించాలనీ ఆయనే అన్నారు. కొంతమందికి కొత్తగూడెం నియోజకవర్గంలో ఐదేళ్లు గడిచాక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని మొత్తుకునే పరిస్థితి వస్తుందని అప్పుడు కనుచూపుమేరలో మద్దతు తెలిపే వారు కూడా కరువవుతారని అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు. ప్రజలకు కార్మికులకు కర్షకులకు అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కొంతమంది వ్యక్తులు పదవే శాసనం గా పరమావధిగా ఇక పదవి శాశ్వతంగా ఉంటుందని అనుకుంటూ నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా కొత్తగూడెంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు కుతంత్రాలను ప్రజాస్వామ్యవాదులు ప్రజలు గుర్తించాలని తామే అన్నీ అనుకుంటున్నా వారికి బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లారీ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లారీ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరుపుకునే విధంగా ఇరువర్గాలు ముందుకు పోవాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.