పాల్గొన్న ఎమ్మెల్యే, కోరం కనకయ్య, కలెక్టర్ జీతీష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
అన్నపురెడ్డిపల్లి ,నవంబర్21 వై 7 న్యూస్;
అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో గత మూడు రోజులుగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ల తోపాటు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చూసి విజేతలను నిర్ణయించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములును శాలువాతో సత్కరించారు.
Post Views: 33