యువ కార్మికులకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న బీజేపీ,మోడీ కుట్రలను తెప్పికొడదాం
బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలి
సింగరేణి సంస్థకే బొగ్గు గనుల కేటాయించాలి
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణకై సంతకాల సేకరణ
సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్
మంచిర్యాల,నవంబర్18 వై 7 న్యూస్
సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా బొగ్గు గనులు సింగరేణికే కేటాయించే విధంగా వారసత్వ పోరాటాలను కొనసాగిస్తూ,సింగరేణి సంస్థను కాపాడుకోవల్సిన బాధ్యత ఎన్ని ఆశలతో వచ్చిన యువ కార్మికులపైనున్నదని సంకె రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి,దూలం శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి,మోడీ ప్రభుత్వం రాగానే మొదటగా తెలంగాణ ప్రైవేటీకరణ కత్తి పెట్టారు.సింగరేణి సంస్థకు కేటాయించాల్సిన బొగ్గు గనులను,వేలంపాట ద్వారా కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలకు పూనుకున్నారన్నారు.దీన్ని
సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు.తెలంగాణకు సిరులగనిగా, ఉపాధినిచ్చే వనరుగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్న కల్పతరువుగా సింగరేణి సంస్థ నడుస్తుందని,దీనిపైన కన్నేసిన బిజెపి,మోడీ ప్రభుత్వం ఆధాని, అంబానీలకు ఈ సంపదను కట్టబెట్టడానికి వేలం పాటను ముందుకు తీసుకువచ్చారన్నారు. సిపిఎం మంచిర్యాల జిల్లా 3 వ మహాసభల సందర్భంగా మొదటి తీర్మానంగా సింగరేణి పరిరక్షణ కొరకు వేలం పాటను రద్దు చేయాలని,సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ,సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.సోమవారం కేకే-5 మైన్,ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, జి యం కార్యాలయంలలో సంతకాల సేకరణ చేయించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి 23వ తేదీ వరకు అన్ని మైన్లలో,కార్మిక కాలనీలలో,వ్యాపారస్తుల వద్ద, ప్రజలు,రైతులు, యువకులు,విద్యార్థుల నుండి సంతకాల సేకరణ చేసి,గవర్నర్ కు,కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ఇవ్వడం జరుగుతుంది.అన్ని వర్గాల ప్రజలు,సంఘాలు నాయకులు,రాజకీయ పార్టీలు సీపీఎం చేస్తున్న సింగరేణి పరిరక్షణ పోరాటానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యం.కనకయ్య జిల్లా అధ్యక్షులు సోషలిస్టు పార్టీ (ఇండియా) ముల్కల రాజేంద్రప్రసాద్,బీఎస్పీ చెన్నూర్ నియోజక వర్గ అధ్యక్షులు,అల్లి రాజేందర్ ఎంప్లాయీస్ యూనియన్ (సి ఐ టి యు) మందమర్రి ఏరియా కార్యదర్శి.రాజేంద్ర ప్రసాద్ సీపీఎం నాయకుల తదితరులు పాల్గొన్నారు.