వెల్దుర్తి నవంబర్18 వై సెవెన్ న్యూస్
మెదక్ జిల్లా కొప్పులపల్లి గ్రామానికి చెందిన గేట్యాలో చంద్రమ్మ చిన్న కుమారుడు ప్రభాకర్ ప్రింటింగ్ ఫ్లెక్సీ లో పనిచేస్తాడని తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం మూడు గంటలకు తూప్రాన్ లోని ఫ్లెక్సీ ప్రింటింగ్ చేయడానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన ప్రభాకర్ తిరిగి రాలేదని తెలిపారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఫోన్ చేయగా ప్రభాకర్ ఫోన్ కల్వకపోవడంతో చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికిన ఆచూకీంచలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మీరు 17వ తేదీ ఉదయం 11:30 గంటలకు కొప్పులపల్లి ఊర చెరువులో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలియడంతో ఫిర్యాదురాలు చంద్రమ్మ వెళ్లి చూడగా అట్టి శవం తన కుమారుడు ప్రభాకర్ దేనని గుర్తించారు. అతని దగ్గర గల సూసైడ్ లెటర్ అప్పుల వాళ్ళ ఒత్తిడి వల్ల అనుమానాస్పందంగా చనిపోయినట్లు ఉందని ఆ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఏఎస్ఐ తెలిపారు.