కొత్తగూడెం, నవంబర్ 14 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైల్డ్ వైల్ఫేర్ కమిటీ సభ్యుడు న్యాయవాది మహమ్మద్ సాదిక్ పాషా రచించిన ‘ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్’ పుస్తకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలేక్టర్ జితేష్ పాటిల్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలేక్టర్ బాలల సైకాలజీ పై సాదిక్ పాషా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విథ్య చందన, జిల్లా సంక్షేమ అధికారి లేనినా స్వర్ణలత, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ జీ.భారతరాణి, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు యస్.సుమిత్ర దేవి, సేవ్ మున్సిపాలిటీ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ మహమ్మద్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 259









