ములుగు,నవంబర్01 వై 7 న్యూస్;
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క మహారాష్ట్ర ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఈ సాయంత్రం హైదరాబాదు చేరుకున్నారు. గురువారం సాయంత్రం కుటుంబ సమేతంగా దీపావళి పండుగను పురస్కరించుకొని దివ్యకాంతులు వెలిగించారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆసమానతల చీకట్లను పారద్రోలి, తోటి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా, దీపావళి పండుగ జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో నియంతృత్వ చీకట్లో తరిమి ప్రజాస్వామ్య వెలుగులను విరబోయించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ యూత్ ఐకాన్ రియల్ స్టార్ సీతక్క కుమారుడు ధనసరి సూర్య మరియు మేనల్లుడు సంతోష్ పాల్గొన్నారు.
Post Views: 152