పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్
చర్ల, అక్టోబర్ 31 వై7 న్యూస్;
గత రెండు నెలల కిందట కోలకత్తాలోని ఆర్ జె కార్ హాస్పిటల్ లో జరిగిన అభయ ఘటనపై సుప్రీంకోర్టు సిబిఐ లు సోద్యం చూస్తున్నాయని దోషులను శిక్షించకుండా కాపాడే మార్గం ఎంచుకుంటున్నాయని దీనిని ఖండిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎప్ టియు కేంద్రకమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్స్ లు, వర్కర్స్ లతో ప్రచారం నిర్వహించడం జరిగింది.
అనంతరం ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జిల్లా నాయకులు గొంది ముయ్యన్న అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో
పి వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్* మాట్లాడుతూ మానవత దృక్పథంతో రోగులకు సేవ చేయాలని ఉద్దేశంతో వైద్య వృత్తిని నమ్ముకుని సేవ చేస్తున్న అభయ పై కొంతమంది యాజమాన్యం వారి దోపిడీని ఎక్కడ బయటపెడుతుందోనని భయంతో అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటనకు కారకుడైన ప్రిన్సిపల్ ని మరి కొంతమందిని వదిలిపెట్టి అక్కడ ఉండే ఒక మందు తాగే యువకుడిని కేసులో ఇరికించి చేతులు దులిపేసుకోవాలని చూస్తుందని వారన్నారు.ఈ ఘటన మరవకముందే కేరళ,అయోధ్య లాంటి ప్రాంతాలలో పారిశుధ్య కార్మికులపై కూడా అత్యాచారాలు దాడులు చేస్తూ హత్య చేస్తున్నారని వీటిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు పనిచేస్తున్న పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని మహిళా రక్షణ చట్టం తీసుకురావాలని పి వై ఎల్ గా కోరుతున్నాం. అలాగే అభయ ఘటనలో దోషులైన వారిపై సిబిఐ సత్వరమే విచారణ చేసి సుప్రీంకోర్టుకు కేసు అప్పగించి దోషులకు శిక్ష పడే విధంగా చేయాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు అన్నారు.దేశ అభివృద్ధిలో మహిళలే ప్రధాన కీలకం కానీ ఆ మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వారన్నారు. ఈ దేశానికి ఒక మహిళ రాష్ట్రపతిగా ఉంది అయినా మహిళల పట్ల రక్షణ చట్టాలు రావడంలేదని నిర్ణయాలను చట్టాలు వచ్చినా అవి నిరూపియోగంగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఉన్నవాడికి చట్టాలు వాళ్లకు చుట్టాలు అనే రీతిలో ఉన్నాయని వారన్నారు. కార్మిక మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో , వర్కర్స్ మరియు ట్రైనీ నర్సులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.