E-PAPER

ట్రాఫిక్ రూల్స్ తప్పితే కఠినమైన చర్యలు తీసుకుంటాం ;టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున

మిర్యాలగూడ, అక్టోబర్ 05 వై7న్యూస్
నాగభూషణం రిపోర్టర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టూ టౌన్ పియస్ ఇన్స్పెక్టర్ పి.నాగార్జున మరియు ట్రాఫిక్ సిబ్బంది, టూ టౌన్ పియస్ సిబ్బంది తో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్ లో తోపుడు బండ్లతో రోడ్లన్నీ సగం వరకు ఆక్రమణలతో నిండిపోవడంతో వాహనదారులు, పాదాచారులు రోడ్డుపై వెళ్లడానికి వీలులేకుండా ఉంటుందని మా దృష్టికి రావడంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడమైనది. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్ల ను పక్కకు జరిపించారు. ముఖ్యంగా దుకాణాల ముందు ఇష్టారీతిన వాహనాలు నిలిపి ఉంచడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నట్లుతెలిసిందని,దుకాణదారులకు ఒకటికి రెండుసార్లు హెచ్చరించి పద్ధతి మార్చుకోకుంటే కేసులు నమోదు చేస్తామని తెలియజేసారు. సాగర్ రోడ్ లో ఆటోలు ఇష్టా రీతిన నిలపడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మా దృష్టికి వచ్చినదని, ఆటొలను కూడా క్రమపద్ధతిలో తిరగని యడల చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :