. దళిత సంఘాల డిమాండ్.
ఆశ్వాపురం,అక్టోబర్ 04 వై సెవెన్ న్యూస్ కే.సైదులు (ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వాపురం మండలం
మణుగూరు ఆర్ అండ్ బీ ప్రధాన కూడలిలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టాలనే ఆలోచనను విరమంచు కోవాలని ఎమ్ ఆర్ పి ఎస్,మాదిగ జేఏసీ, ఎమ్ ఎస్ పి, మాల మహానాడు, వివిధ సంఘాలు డిమాండ్ చేశాయి.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ,మణుగూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కొందరు రాజకీయ పార్టీల ప్రముఖులు వారి నాయకులు విగ్రహాలు పెట్టేందుకు పూనుకుంటున్నారని దళిత సంఘాల దృష్టికి వచ్చింది అన్నారు.అయితే ఇక్కడ ఒక పార్టీ విగ్రహంతో మొదలై అనేక పార్టీల విగ్రహాలు నెలకొల్పేందుకు సన్నాహక చర్యలు రాజకీయ పార్టీల వారు చేసే అవకాశం ఉందన్నారు.ఇక్కడ ప్రధాన కూడలిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వమే అధికారిక హోదాలో నెలకొల్పిన కారణంగా ఈ స్థానంలో ఆయనకు దీటుగా మరో విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తే దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామన్నారు.నాయకులు విగ్రహాలు పెట్టే ఆలోచనను మానుకుంటే మంచిదన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గద్దల నాగేశ్వరరావు, ఎమ్ ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు ఇసంపల్లి కృష్ణ,దళిత సంఘం సీనియర్
నాయకుడు గద్దల రామకృష్ణ,ప్రచార కార్యదర్శి వల్లెపొగు వెంకటేశ్వర్లు, మాల మహానాడు జిల్లా నాయకులు కాలవ శాంసన్,మేకల భాస్కర్, ఎమ్ ఆర్ పి ఎస్ నియోజక వర్గ సీనియర్ నాయకులు బోయిల్ల నరసింహారావు, ఎస్సీ సెల్ నాయకులు చుంచు రామ మూర్తి,బంజారా నాయకులు భూక్యా చందు నాయక్, గద్దల చైతన్య, తదితరులు పాల్గొన్నారు.