మధిర,అక్టోబర్04 వై 7 న్యూస్, మధు (ప్రతినిధి);
టీజీ ఎన్పీడీసీఎల్ సిఎండి కే. వరుణ్ రెడ్డి రాష్ట్రంలో కరెంటు సమస్యల పరిష్కారానికి సౌర విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తుందని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టి జి ఎన్ పి డి సి ఎల్) సిఎండి కే. వరుణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ పరిధిలోని సిరిపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ గా సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది తో కలిసి ఈరోజు సిరిపురం గ్రామంలో సిఎండి కే .వరుణ్ రెడ్డి గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు సౌర విద్యుత్ వ్యవస్థ గురించి అవగాహన కల్పిస్తూ వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. గృహాలకు, వ్యవసాయ పంపుసెట్ లకు సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంతో పాటు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార
