E-PAPER

నిజాయితీ చాటుకున్న RTC కంట్రోలర్ వై.యస్.ప్రకాష్ మోహన్ రావు

కోదాడ,సెప్టెంబర్30 వై 7న్యూస్;

కోదాడ పట్టణం సాలార్జింగ్ పేట కు చెందిన కుక్కల శ్రీకృష్ణ అనే వ్యక్తి హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ లో ప్లాట్ ఫామ్ నెంబర్ 4 వద్ద కూర్చుని, తన కోడాడ బస్ రావటంతో, సుమారు 1400 విలువ కలిగిన ఇయర్ బడ్స్ ప్లాట్ ఫామ్ వద్దనే మరచి బస్ ఎక్కి వెళ్ళటం జరిగింది. కొంతదూరం ప్రయాణం చేసిన పిదప తను ఇయర్ బర్డ్స్ మరచిన విషయం గుర్తుకు వచ్చి తిరిగి హుజూర్ నగర్ బస్టాండ్ కు వచ్చి కంట్రోలర్ వై.యస్.ప్రకాష్ మోహన్ రావు కు విషయం తెలపగా అప్పటికే ఇయర్ బర్డ్స్ ను జాగ్రత్త పరచిన కంట్రోలర్ దొరికిన వస్తువు వచ్చిన వ్యక్తిదే అని రూఢి పరచుకొని అక్కడ అందుబాటులో ఉన్న ఇతర ప్రయాణికుల సమక్షంలో పోగొట్టుకున్న వస్తువును ఆ వ్యక్తికి అందించటం జరిగింది. ఈ బాబు కోదాడ కె ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్ బి ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :