E-PAPER

రుణమాఫీ కోసం కదం తొక్కిన అన్నదాత రైతు

ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధారిలో రాస్తారోకో

గాంధారి సెప్టెంబర్ 30 వై సెవెన్ న్యూస్ తెలుగు

గాంధారి మండల కేంద్రంలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్నదాతలు సోమవారం కదం తొక్కారు.కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అన్నదాతలు పెద్ద ఎత్తున గాంధారి మండల కేంద్రానికి చేరుకొని భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాస్ పుస్తకాల ప్రామాణికం ఆధారంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, పాడి రైతులకు పెండింగ్లో ఉన్న పాల బిల్లు విడుదల చేయాలి, అన్ని రకాల ధాన్యం కు 500 బోనస్ చెల్లించాలి డిమాండ్లతో గాంధారిలో భారీ రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ఎత్తున తరలివచ్చిన అన్నదాతలతో గాంధారి ప్రధాన రహదారి కిక్కరిసిపోయింది. బారస మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఈ ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా రైతుల అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసి తీరాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ అన్నదాతలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. అన్నదాతతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఎన్ని రోజులు కూడా నిలపడదు అంటూ రైతులు ప్రత్యక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా అన్నదాతలు ఈ ధర్నాకు తరలివచ్చారు. భారీ ఎత్తున ట్రాక్టర్లలో, వాహనాలలో రైతులు గాంధారి మండల కేంద్రానికి తరలివచ్చారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమ డిమాండ్లను తక్షణం ప్రభుత్వం నెరవేర్చాలంటూ అన్నదాతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న అన్నదాతలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫమైందని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు కోత దశకు వస్తున్న సమయంలో కూడా ఇప్పటివరకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వెయ్యలేదంటూ అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రైతులను రాజులను చేస్తాం అని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు ఇప్పటికైనా స్పందించండి అన్నదాతలను ఆదుకోవాలని పెద్ద ఎత్తున నిరసన గళం విప్పారు. పెద్ద ఎత్తున రైతులు మహాధర్నకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తమ డిమాండ్లతో నేన వేర్చే వరకు తమ ఉద్యమం ఆగదంటూ రైతు ఐక్యవేదిక నిర్వాహకులు ప్రభుత్వానికి హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :